- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతులు.. చివరకు పోలీసులు ఏం చేశారంటే ?
<p>దిశ , జనగామ: జనగామ కలెక్టరేట్ ముందు ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, లక్ష్మయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని ఇరువురికి చెందిన 15 ఎకరాల పైచిలుకు వ్యవసాయ భూమి అక్రమంగా వేరేవారు పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు కలెక్టర్, ఎమ్మార్వోల చుట్టూ తిరిగిన లాభం లేకుండా […]</p>

X
దిశ , జనగామ: జనగామ కలెక్టరేట్ ముందు ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, లక్ష్మయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని ఇరువురికి చెందిన 15 ఎకరాల పైచిలుకు వ్యవసాయ భూమి అక్రమంగా వేరేవారు పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు కలెక్టర్, ఎమ్మార్వోల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని అందుకే పెట్రోల్ పోసుకోవడానికి సిద్ధమయ్యామని మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కాగా అదనపు కలెక్టర్ స్పందించి పూర్తి విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ఎమ్మార్వోకు తెలియజేశారు.
- Tags
- Farmers suicide
Next Story






