- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార పార్టీ ఆగడాలు.. కలెక్టరేట్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్ : అధికార పార్టీకి చెందిన నాయకుడు తమ భూమిని ఆక్రమించడానికి యత్నించడంతోపాటు అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఇద్దరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించునే ప్రయత్నం చేశారు. మెరుపు వేగంతో స్పందించిన ఔట్ పోస్ట్ పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన అనంతరం బాధితులు కుంచె నాని, ప్రభు మాట్లాడుతూ రెచెర్లపేటకు చెందిన వైసీపీ నాయకుడు రాజు తమ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : అధికార పార్టీకి చెందిన నాయకుడు తమ భూమిని ఆక్రమించడానికి యత్నించడంతోపాటు అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఇద్దరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించునే ప్రయత్నం చేశారు. మెరుపు వేగంతో స్పందించిన ఔట్ పోస్ట్ పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు.
ఈ ఘటన అనంతరం బాధితులు కుంచె నాని, ప్రభు మాట్లాడుతూ రెచెర్లపేటకు చెందిన వైసీపీ నాయకుడు రాజు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిపై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగట్లేదని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించామని తల్లీకొడుకు వాపోయారు. అధికార పార్టీ అండదండలతోనే రాజు కబ్జాలకు పాల్పడుతున్నారని, మాకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు.






