- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ జెమిని థియేటర్‌లో ఆత్మహత్యాయత్నం కలకలం
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జెమిని సినిమా థియేటర్‌లో మంగళవారం ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తరహాద్ సోను అనే వ్యక్తి జెమిని టాకీస్‌లో గతంలో స్వీపర్‌గా పనిచేసేవాడు. జెమిని టాకీస్ ను ఇతరులు లీజ్‌కు తీసుకోవడంతో తరహాద్ సోనును పని నుంచి తొలగించారు. తనను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం థియేటర్‌లోకి చొరబడి స్క్రీన్‌పైకి ఎక్కాడు. పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. టాకీస్ సిబ్బంది, మట్టెవాడ పీఎస్ కానిస్టేబుళ్లు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జెమిని సినిమా థియేటర్‌లో మంగళవారం ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తరహాద్ సోను అనే వ్యక్తి జెమిని టాకీస్‌లో గతంలో స్వీపర్‌గా పనిచేసేవాడు. జెమిని టాకీస్ ను ఇతరులు లీజ్‌కు తీసుకోవడంతో తరహాద్ సోనును పని నుంచి తొలగించారు. తనను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం థియేటర్‌లోకి చొరబడి స్క్రీన్‌పైకి ఎక్కాడు. పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. టాకీస్ సిబ్బంది, మట్టెవాడ పీఎస్ కానిస్టేబుళ్లు వెంటనే థియేటర్ బయటకు సోనును లాక్కెళ్లారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
- Tags
- cinema
Next Story






