పెళ్లయిన ఐదునెలలకే ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2020-03-09 07:06:53  IST  )

<p>&nbsp; దిశ, మేడ్చల్: పెళ్లయిన ఐదు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని నేరేడు‎మెట్‎లో చోటుచేసుకుంది. ఈ విషాదఘటన స్థానికంగా కలకలం రేపింది. రాహుల్ యాదవ్(26) రైల్వేలో ఉద్యోగం చేస్తూ నేరేడు‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం రాహుల్ యాదవ్‌కు వివాహం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదు గానీ.. తన ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల [&hellip;]</p>

పెళ్లయిన ఐదునెలలకే  ఆత్మహత్య
X

దిశ, మేడ్చల్: పెళ్లయిన ఐదు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని నేరేడు‎మెట్‎లో చోటుచేసుకుంది. ఈ విషాదఘటన స్థానికంగా కలకలం రేపింది. రాహుల్ యాదవ్(26) రైల్వేలో ఉద్యోగం చేస్తూ నేరేడు‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం రాహుల్ యాదవ్‌కు వివాహం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదు గానీ.. తన ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

Tags: new bride, suicide, at home, neredmet

Next Story