సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ హామీ

by Vemula.Srinu Prasad |

<p>గత రెండేండ్ల క్రితం అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చాడు. మంగళవారం ప్రీతి కుటుంబసభ్యులు సీఎం జగన్‌ను కలిశారు. మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని, కుటుంబాన్ని ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. మరోసారి ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇటీవలే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన అధినేత [&hellip;]</p>

గత రెండేండ్ల క్రితం అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చాడు. మంగళవారం ప్రీతి కుటుంబసభ్యులు సీఎం జగన్‌ను కలిశారు. మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని, కుటుంబాన్ని ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. మరోసారి ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇటీవలే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కర్నూలో భారీ ర్యాలీ తీసి, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Next Story