- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి అమ్మాయి అయితే ఓకే : సుధీర్
<p>దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ అంతే ప్రస్తుతం తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అంతేగాకుండా సుధీర్ అనే పేరు వినగానే యాంకర్ రష్మి పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. ఏదైనా షోలో వీళ్లిద్దరూ కలిసి చేస్తే… ఇక ఆ షో హైలెట్ అయినట్టే. ఈ క్రమంలో వీరిద్దరూ మంచి ప్రేమికులని, పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అభిమానులందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా సుధీర్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ అంతే ప్రస్తుతం తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అంతేగాకుండా సుధీర్ అనే పేరు వినగానే యాంకర్ రష్మి పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. ఏదైనా షోలో వీళ్లిద్దరూ కలిసి చేస్తే… ఇక ఆ షో హైలెట్ అయినట్టే. ఈ క్రమంలో వీరిద్దరూ మంచి ప్రేమికులని, పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అభిమానులందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా సుధీర్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అసలు తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. పెళ్లి అంటేనే తనకు నచ్చని కాన్సెప్ట్ అని చెప్పాడు సుధీర్. జీవితంలో సింగిల్ గానే ఉండాలని అనిపిస్తుందని.. తోడు అవసరం లేదనే అనిపిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా కూడా ఇంట్లో వాళ్లు మాత్రం గోల పెడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే తన తమ్ముడికి కూడా పెళ్లైపోయింది కాబట్టి కచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిందే అంటూ ప్రాణం తీస్తున్నారని సుధీర్ అన్నారు. ఒకవేళ చేసుకున్నా కూడా తనకు జీవితాంతం మోరల్ సపోర్ట్ ఇవ్వాలని.. అలాంటి అమ్మాయి అయితే ఓకే అన్నాడు.






