సుధీర్ బాబు న్యూ బిజినెస్ ప్లాన్

by  |
సుధీర్ బాబు న్యూ బిజినెస్ ప్లాన్
X

సినిమా స్టార్స్‌గా రాణిస్తునే వ్యాపార రంగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు నటీనటులు. సినిమాల్లో సంపాదించిన డబ్బులు తమకు నచ్చిన రంగంలో ఇన్వెస్ట్ చేస్తూ..డబుల్, ట్రిపుల్ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశాలు ఉన్నప్పుడే సెటిల్ అయిపోయి, సినిమాల్లో చాన్స్ లు లేని సమయంలో బిజినెస్ చూసుకుంటూ ఉండొచ్చని అనుకుంటారు. అలా అయితేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని వారి ఆలోచన.

మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు ఇప్పటికే ఒక క్లాత్ బ్రాండ్ కూడా రిలీజ్ చేయగా..మహేశ్ ఏ‌ఎం‌బీ థియేటర్స్ నెలకొల్పడమే కాదు.. సినిమా ప్రొడక్షన్ సంస్థ కూడా ప్రారంభించారు. రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా మారగా, సందీప్ కిషన్ నిర్మాతగా రాణించడంతో పాటు రెస్టారెంట్‌లు కూడా నడిపిస్తున్నాడు.

అదే కోవలో కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇంటి పట్టునే ఉంటున్న సుధీర్ బాబు ఇప్పటికే నిర్మాతగా మారగా.. సరికొత్త ఆలోచన చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా స్టూడియో నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నట్లు చెప్పాడు. ఇందుకోసం స్థలం కూడా వెతుకుతున్నట్టు తెలిపిన సుధీర్ బాబు.. త్వరలో ఇందుకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తానన్నాడు. దీంతో ఇంత పెద్ద ఆలోచనకు తొందరగా కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.


Next Story

Most Viewed