మరోసారి.. తనతోనే సుధీర్!

by  |
మరోసారి.. తనతోనే సుధీర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో సుధీర్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ‌కాంబినేషన్‌‌లో ముచ్చటగా మూడో ‘ప్రాజెక్ట్’ పట్టాలెక్కనుంది. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల్లో సుధీర్ బాబును డిఫరెంట్‌గా చూపించిన మోహనకృష్ణ.. మరోసారి తనను ఓ వైవిధ్యమైన పాత్రలో చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మూవీ షూటింగ్‌ను ఈ రోజు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు.

సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాగా, ఇందులో కృతిశిట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌గా పి.జి.వింద, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ వ్యవహరించనున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1345999201537204230



Next Story

Most Viewed