ఫిట్‌నెస్ గోల్స్: సుధీర్ బాబు హోమ్ వర్కౌట్

by  |
ఫిట్‌నెస్ గోల్స్: సుధీర్ బాబు హోమ్ వర్కౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయపెడుతున్న వేళ షూటింగ్‌లు మానేసి సినీతారలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఫ్యామిలీస్‌తో రిలాక్స్ అవుతున్నారు. కానీ ఫిట్‌నెస్ గోల్స్ మాత్రం తప్పట్లేదు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని సూచనలిస్తున్న హీరో సుధీర్ బాబు… కోవిడ్ 19పై పోరాడేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందన్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా జిమ్స్ పూర్తిగా బంద్ చేసిన నేపథ్యంలో వర్కౌట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఇంటి నుంచే సలహాలు ఇస్తున్నాడు. ఇంట్లోనే ఉండి ఎలాంటి వర్కౌట్స్‌ చేయాలో చూపిస్తున్నాడు సుధీర్ బాబు. మొత్తం ఐదు రోజుల వర్కౌట్లో భాగంగా ఫస్ట్ డే వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ప్రతీ ఒక్కరు తమను తాము సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకోవాలని సూచించిన సుధీర్ బాబు… వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని తెలిపాడు.

వర్కౌట్ వీడియోలో సుధీర్ ఫిట్‌నెస్ బాడీకి ఫిదా అయిపోయిన జనాలు.. బాబు బాడీ బాక్సాఫీస్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇలాగే ఎప్పుడూ సూచనలివ్వాలని కోరుతున్నారు. కాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు చేసిన మూవీ ‘వి’ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడిన సంగతి తెల్సిందే.

Tags : Sudheer Babu, Home WorkOut, Covid19, CoronaVirus


Next Story

Most Viewed