- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌పి శైలజ ఇంట్లో మరో విషాదం.. బాధలో ‘శుభలేఖ’ సుధాకర్
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పి శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం(82) కన్నుమూశారు. గత మూడు నెలల క్రితం ఆమెకు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అప్పటినుంచి మంచానికే పరిమితమైన ఆమె మంగళవారం చెన్నై మహాలింగపురంలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుధాకర్ తండ్రి సూరావజ్జల కృష్ణారావు రెండేళ్ల క్రితం మృతిచెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పి శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం(82) కన్నుమూశారు. గత మూడు నెలల క్రితం ఆమెకు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అప్పటినుంచి మంచానికే పరిమితమైన ఆమె మంగళవారం చెన్నై మహాలింగపురంలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుధాకర్ తండ్రి సూరావజ్జల కృష్ణారావు రెండేళ్ల క్రితం మృతిచెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి కాంతం భౌతికకాయానికి ఘన నివాళి అర్పించారు.

- Tags
- dies
Next Story






