యువకుడిపై ఎస్ఐ దాడి.. ఆస్పత్రిలో..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-25 06:40:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఏపీలో పోలీసుల దురుసు ప్రవర్తన ఆ డిపార్ట్ మెంట్‌కు చెడ్డపేరును తెచ్చిపెడుతోంది. మొన్న జరిగిన ప్రకాశం జిల్లా ఘటన మరవక ముందే, తాజాగా కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ రెచ్చిపోయాడు. తనపై ఓ యువకుడు అభ్యకర పోస్ట్ పెట్టాడనే కారణంతో ఇంటికెళ్లి దాడి చేయడంతో ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిపాలయ్యాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువకుడు రాజేశ్.. చిల్లకల్లు ఎస్ఐ అభిమన్యు రౌడీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. [&hellip;]</p>

యువకుడిపై ఎస్ఐ దాడి.. ఆస్పత్రిలో..
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఇటీవల ఏపీలో పోలీసుల దురుసు ప్రవర్తన ఆ డిపార్ట్ మెంట్‌కు చెడ్డపేరును తెచ్చిపెడుతోంది. మొన్న జరిగిన ప్రకాశం జిల్లా ఘటన మరవక ముందే, తాజాగా కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ రెచ్చిపోయాడు. తనపై ఓ
యువకుడు అభ్యకర పోస్ట్ పెట్టాడనే కారణంతో ఇంటికెళ్లి దాడి చేయడంతో ప్రస్తుతం ఆ యువకుడు
ఆస్పత్రిపాలయ్యాడు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువకుడు రాజేశ్.. చిల్లకల్లు ఎస్ఐ అభిమన్యు రౌడీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఎస్ఐ అభిమన్యు ఆగ్రహంతో జగ్గయ్యపేటకు వెళ్లి ఇంట్లో ఇన్న రాజేశ్ పై దాడికి పాల్పడినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఎస్ఐ దాడిలో రాజేశ్ గాయాలపాలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Next Story