సోషియాలజీ (పేపర్ -2, గ్రూప్ -2 స్పెషల్)

by Disha Web Desk 17 |
సోషియాలజీ (పేపర్ -2, గ్రూప్ -2 స్పెషల్)
X

కుటుంబ విధులు:

జార్జి మొర్టాక్ : ఈయన ప్రకారం

1. దైహిక విధులు: లైంగిక ఆనందం, సాహచర్యం, ప్రేమానురాగాలను తృప్తి పరచుకుంటూ, సంతానాన్ని కాని, వారిని సంరక్షించి, బాధ్యతాయుత సమాజ సభ్యులుగా తీర్చిదిద్దుట.

2. సామాజిక విధులు: సామాజిక నియంత్రణకు కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంస్కృతిని నేర్పిస్తుంది.

పరస్పర మైత్రి, అన్యోన్య సహకారం.. రక్షణ, సామాజిక నియంత్రణ కలిగి ఉంటుంది.

3. ఆర్థిక విధులు: ఆర్థిక భద్రతను ఇస్తుంది. శ్రమ విభజనను కలిగి ఉంటుంది. ప్రాథమిక అవసరాలు అయిన ఆహారం, నివాసం, వస్త్రాలతో పాటు అంతస్తు, అధికారాలను కలిగి ఉంటుంది.

4. లైంగిక విధి: భార్యా, భర్తల మధ్య సంబంధం ఆమోదాన్ని పొందిన లైంగిక సంబంధానికి సాధనంగా ఉండటంతో పాటు, కుటుంబ వ్యవస్థ రూపొందించడానికి పునాది ఏర్పడింది.

5. విద్యా విధులు: కుటుంబం విద్యా పరమైన విధులను కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది.

6. ప్రత్యుత్పత్తి విధి: కుటుంబాల ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంటుంది.

7.సాంస్కృతిక విధి: కుటుంబం సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా పనిచేస్తుంది. అలవాట్లు, పద్ధతి, జీవనశైలి, ఆచారాలు, విద్యా- విజ్ఞాన అంశాలు, సాంస్కృతిక అంశాలు, కళలు, విద్యా అవకాశాలు కుటుంబం కల్పిస్తుంది.

కుటుంబం లక్షణాలు:

ఆర్ఎం. మైకేవర్ తన గ్రంథం సొసైటీలో..

1. విశ్వవ్యాపితం: కుటుంబం సర్వం వ్యాపించి ఉంది.

2. పరిమిత ప్రమాణం: అన్ని సామాజిక వ్యవస్థ కన్నా కుటుంబం పరిమాణంలో చిన్నది.

3. కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత: కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం. సంక్షేమం కోసం బాధ్యతగా కృషి చేస్తారు.

4. అధ్యయన కేంద్రం: కుటుంబం మానవుని ప్రాథమిక పాఠశాల. సమాజంలోని పద్ధతుల్ని కుటుంబంలోనే నేర్చుకుంటారు.

5. సాంఘిక నియంత్రణ: నైతిక విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేర్పుతుంది.

6. శాశ్వతత్వం: పరివర్తన కుటుంబాన్ని ఒక సామాజిక వ్యవస్థ గా తీసుకుంటే, అది మానవ జాతి పుట్టుక నుండి ఇప్పటి వరకు శాశ్వతంగా ఉంటూ వస్తున్న సంస్థ.

మైకేవర్: పిల్లల్ని కనడం, పెంచడం, విధుల్ని నిర్వహించడానికి, స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం.

కుటుంబాలు అనే భావన గురించి మొదటగా చెప్పినది: అరిస్టాటిల్, ప్లేటో.

రీమాండ్ ఫర్: త్రికోణ రూపాన్ని ఇచ్చాడు.

ఒక వైపు భర్త, మరో వైపు భార్య, మూడవ వైపు వారి సంతానం.

బర్దస్ అండ్ లాక్: కుటుంబం అనేది వివాహ బంధం చేత గానీ, రక్త సంబంధం చేత గానీ, దత్తత చేతగానీ ఏకమై ఒకే గృహంలో నివసించడం.

ఇరావతి కార్వే : ఒకే పై కప్పు కింద నివసిస్తూ, ఒకే వంటగదిలో చేసిన ఆహారాన్ని తింటూ, ఒకే ఆస్థిని కలిసి అనుభవిస్తూ కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొంటూ, ఒకరికొకరు బంధువు అయిన సందర్భమే ఉమ్మడి కుటుంబం.

సమ్నర్, మోర్గాన్ ఆధ్యయనాల ప్రకారం: అనాదిగా ‘మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేదని ’ చెప్పారు.

ఫ్రెడరిక్ ఏంగిల్స్: ‘ది ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ది స్టేట్’

మైకేవర్ కుటుంబ విధులు రెండు రకాలు:

1. ఆవశ్యకమైనవి : పిల్లల్ని కనడం, పెంచడం, గృహ సదుపాయం.

2. ఆవశ్యకమైనవి : మత బోధన, విద్య, ఆర్థిక, ఆరోగ్య, వినోదం.

కుటుంబం - రకాలు:

ప్రాథమిక కుటుంబం: కనిష్ఠ కుటుంబం:

దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం.

ఈ కుటుంబంలో పెరిగే పిల్లలు వారి సమాజ ఆచారాన్ని, కట్టుబాట్లను ప్రథమంగా తెలుసు కుంటారు.

2. కాంపోజిట్ ఫ్యామిలీ: దంతపుత్రులు + వారి సంతోషం

సంతానానికి వివాహం అయితే ప్రాథమిక గుణాన్ని కోల్పోయి అది కాంపోజిట్ కుటుంబం గా మారును.

వివాహం తర్వాత పుట్టింట్లో కూతుర్లు ఉండవలెనా? కుమారుడు ఉండవలెనా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

ఈ కుటుంబంలోని సమస్యల సంఖ్య ఎప్పుడు అధికంగా ఉంటుంది.

- వట్టిపల్లి శంకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ


Next Story

Most Viewed