నిజాం పాలనలో విద్య: (గ్రూప్ 2 తెలంగాణ హిస్టరీ స్పెషల్)

by Disha Web Desk 17 |
నిజాం పాలనలో విద్య: (గ్రూప్ 2 తెలంగాణ హిస్టరీ స్పెషల్)
X

ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన:

విద్యా సదస్సులు: 1915, 1919 మధ్య హైదరాబాద్ సంస్థానంలో నాలుగు విద్యా సదస్సులు జరిగాయి.

అవి..

1. 1915లో 1వ విద్యా సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు.

2. 1916లో 2వ విద్యా సదస్సు ఔరంగాబాద్‌లో జరిగింది.

3. 1917లో 3వ విద్యా సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించారు.

4. 1919లో 4వ విద్యా సదస్సు లాతోర్‌లో జరిగింది.

1915 మార్చి 1న హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ మొదటి విద్యా సదస్సుకు అప్పటి నిజాం ప్రభుత్వ హోం సెక్రటరీ సర్ అక్బర్ హైదరీ అధ్యక్షత వహించాడు.

మొదటి విద్యా సదస్సు జరగడానికి ప్రధాన కారకుడు - మహ్మద్ ముర్తాజా

ఈ విద్యా సదస్సు కృషి ఫలితమే ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన.

ఓయూని తన మానస పుత్రికగా భావించి నిర్మాణం కోసం ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేసింది -సర్ అక్బర్ హైదరీ

ఉస్మానియా యూనివర్సిటీ:

1917 ఏప్రిల్ 26న ఓయూ స్థాపనకు 7వ నిజాం ఫర్మానా జారీ చేశాడు.

1918 సెప్టెంబర్ 22న ఓయూ స్థాపన జరిగింది.

1919 ఆగస్టు 28న అబిడ్స్ అద్దె భవనంలో ఉర్దూ బోధనా భాషగా 25 మంది సిబ్బంది 225 మంది విద్యార్థులతో ప్రారంభమైంది.

ఓయూ భవన సముదాయానికి 1400 ఎకరాలను ఎంపిక చేయడంలో నేతృత్వం వహించింది - సర్ పాట్రిక్.

భారతదేశంలో మొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం- ఉస్మానియా యూనివర్సిటీ

ఓయూ మొదటి వైస్ చాన్సలర్ - హబీబ్ రెహమాన్‌ఖాన్ (1918-19)

ఈ విశ్వవిద్యాలయం తెలుగు భాషకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.

1923 జులై 5న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి 7వ నిజాం శంకుస్థాపన చేశాడు.

1938లో వివిధ యూనివర్సిటీల భవన నిర్మాణ రీతులను అధ్యయనం చేయడానికి విదేశాలకు వెళ్లిన వారు వాహబ్ జెయిన్ మార్జంగ్, సయ్యద్ అలీ రాజా.

1939లో ఆర్ట్స్ కాలేజ్ భవనం నిర్మాణం పూర్తయింది.

1939 డిసెంబర్ 4న 7వ నిజాం ఆర్ట్స్ కాలేజ్ భవనం ప్రారంభించాడు.

ఆర్ట్స్ కాలేజ్ మొదటి ప్రిన్సిపల్ - సర్‌రాస్ మసూద్

ఈ కళాశాల నిర్మాణంలో ఉపయోగించిన రాయి - పింకిష్ గ్రానైట్ రాయి

- వెంకటరాజం బొడ్డుపల్లి, సీనియర్ ఫ్యాకల్టీ.


Next Story

Most Viewed