- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్‌సీయూలో విద్యార్థుల నిరసన
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: హాస్టల్ ఖాళీ చేసి వెళ్లేది లేదంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (యూఓహెచ్) విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. కొవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులను జూన్ 9లోపు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ హెచ్‌సీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగం మే30న ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు భరించే శక్తి లేకపోవడంతో పాటు హోం క్వారెంటైన్ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: హాస్టల్ ఖాళీ చేసి వెళ్లేది లేదంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (యూఓహెచ్) విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. కొవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులను జూన్ 9లోపు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ హెచ్‌సీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగం మే30న ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు భరించే శక్తి లేకపోవడంతో పాటు హోం క్వారెంటైన్ పాటించే స్థితిలో లేని కుటుంబాలు ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడుతారన్నారు. ప్రయాణ సమయంలోనూ తాము కరోనా బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకొనే వరకూ నిరసన్ కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.
Next Story






