- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచ్చలవిడిగా వైన్స్‌లు, ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థుల ఆందోళన..
by Shyam |
<p>దిశ, తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, మాదాపురం గ్రామంలో సకాలంలో బస్సులు నడపాలని గురువారం రోజు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. డిపో మేనేజర్‌కి ఎన్నిసార్లు బస్సులు సరైన సమయానికి నడపాలని విన్నవించుకున్నా ఫలితం లేదని తెలిపారు. కలెక్షన్ల్ రావడం లేదు అన్న కారణంతో గతంలో నడిచే బస్సులను తీసివేశారన్నారు. గ్రామ పంచాయతీ చుట్టు పక్కల గిరిజన తండాలకు చెందిన విద్యార్థులు, ఆడపిల్లలు మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్లేసరికి […]</p>

X
దిశ, తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, మాదాపురం గ్రామంలో సకాలంలో బస్సులు నడపాలని గురువారం రోజు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. డిపో మేనేజర్‌కి ఎన్నిసార్లు బస్సులు సరైన సమయానికి నడపాలని విన్నవించుకున్నా ఫలితం లేదని తెలిపారు. కలెక్షన్ల్ రావడం లేదు అన్న కారణంతో గతంలో నడిచే బస్సులను తీసివేశారన్నారు. గ్రామ పంచాయతీ చుట్టు పక్కల గిరిజన తండాలకు చెందిన విద్యార్థులు, ఆడపిల్లలు మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతుందన్నారు. విచ్చలవిడిగా వైన్స్‌లు ఓపెన్ చేయడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
- Tags
- dharna
Next Story






