- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్‌లో ఫెయిల్.. బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని
by Batti.Sumithra |
<p>దిశ, కమలాపూర్: ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన దామర లత మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ బీపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్ ఉంది. కాగా, గురవారం ఫలితాలు వెలువడగా లత ఫిజిక్స్ సబ్జెక్టులో మళ్లీ ఫెయిల్ అయింది. దీంతో శుక్రవారం […]</p>

X
దిశ, కమలాపూర్: ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన దామర లత మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ బీపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్ ఉంది. కాగా, గురవారం ఫలితాలు వెలువడగా లత ఫిజిక్స్ సబ్జెక్టులో మళ్లీ ఫెయిల్ అయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో మోడల్ స్కూల్ వసతి గృహం పైనుండి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన ఉపాధ్యాయులు అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- kamalapur
Next Story






