అనుమాన స్థితిలో విద్యార్థి మృతి

by Batti.Sumithra |

<p>దిశ, టేకుమట్ల : మండలంలోని ఆశరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మామిడి అక్షయ్ (22) అనుమానస్పద స్థితిలో బుధవారం మరణించాడు. హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్న అక్షయ్ గత నాలుగు రోజుల క్రితం హైదరాబాదు నుండి ఇంటికి వచ్చాడు. బుధవారం బహిర్భూమికి వెళ్లిన అక్షయ్ ఇంటి వెనకాల గల బావిలో శవమై కనిపించాడు. అక్షయ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బావి వద్ద మొబైల్ ఫోన్ కనిపించడంతో, అలాగే ముందుకు వెళ్లి చూడగా బావిలో అక్షయ్ మృతదేహం [&hellip;]</p>

crime news
X

దిశ, టేకుమట్ల : మండలంలోని ఆశరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మామిడి అక్షయ్ (22) అనుమానస్పద స్థితిలో బుధవారం మరణించాడు. హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్న అక్షయ్ గత నాలుగు రోజుల క్రితం హైదరాబాదు నుండి ఇంటికి వచ్చాడు. బుధవారం బహిర్భూమికి వెళ్లిన అక్షయ్ ఇంటి వెనకాల గల బావిలో శవమై కనిపించాడు. అక్షయ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బావి వద్ద మొబైల్ ఫోన్ కనిపించడంతో, అలాగే ముందుకు వెళ్లి చూడగా బావిలో అక్షయ్ మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Next Story