- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరీక్ష రాసేందుకు వచ్చి బిల్డింగ్ పై నుంచి దూకాడు..
<p>దిశ, ముధోల్ : ఈ నెల 16 నుండి కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం పట్టణంలోని సరస్వతి డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసింది. అందులో ఒకరు కల్లురు వాసవి డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థి శ్రీకాంత్ పరీక్ష రాసేందుకు సరస్వతి డిగ్రీ కళాశాలకు వచ్చాడు. అయితే, ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కాలేజీ బిల్డింగ్ పై నుండి కిందకు దూకాడు. అలా […]</p>

దిశ, ముధోల్ : ఈ నెల 16 నుండి కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం పట్టణంలోని సరస్వతి డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసింది. అందులో ఒకరు కల్లురు వాసవి డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థి శ్రీకాంత్ పరీక్ష రాసేందుకు సరస్వతి డిగ్రీ కళాశాలకు వచ్చాడు. అయితే, ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కాలేజీ బిల్డింగ్ పై నుండి కిందకు దూకాడు.
అలా ఎందుకు చేశాడు అని తోటి విద్యార్ధులను వివరణ కోరగా అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతోనే బిల్డింగ్ నుంచి దూకాడని సమాధానం ఇచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణాలకు ఏమీ కాలేదు. కానీ, కాలుకు స్వల్వ గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థులు శ్రీకాంత్‌ను తీసుకుని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఇదిలాఉండగా, మరో విద్యార్థికి మూర్ఛ వ్యాధి వచ్చింది. ఒకేసారి రెండు ఘటనలు జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.






