- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరీక్షలు రాయడానికి నగరానికి వచ్చి.. తల పగిలి యువకుడు మృతి
<p>దిశ, ఎల్బీనగర్ : రెడిమిక్స్ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ సురేందర్ గౌడ్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలం కుడికాల్వ గ్రామానికి చెందిన జిలివేల్లి సాయి కుమార్ (22) పది రోజుల కింద ఐటీఐ పరీక్షలు రాయడానికి హయత్‌నగర్‌లోని వీరభద్రానగర్ కాలనీలో ఉండే తన సోదరుడి ఇంటి వచ్చాడు. ఆదివారం పరీక్షలు ముగియడంతో ఉదయం తన సొంతూరికి ద్విచక్ర […]</p>

దిశ, ఎల్బీనగర్ : రెడిమిక్స్ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ సురేందర్ గౌడ్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలం కుడికాల్వ గ్రామానికి చెందిన జిలివేల్లి సాయి కుమార్ (22) పది రోజుల కింద ఐటీఐ పరీక్షలు రాయడానికి హయత్‌నగర్‌లోని వీరభద్రానగర్ కాలనీలో ఉండే తన సోదరుడి ఇంటి వచ్చాడు.
ఆదివారం పరీక్షలు ముగియడంతో ఉదయం తన సొంతూరికి ద్విచక్ర వాహనం (ఏపీ29 బీఆర్ 9223)పై బయలుదేరాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హయత్‌నగర్ బాతుల చెరువు వద్ద నుంచి వేగంగా దూసుకువచ్చిన రెడిమిక్స్ లారీ (టీఎస్ 08 యూఈ 6580) వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టడంతో సాయికుమార్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మృతుడి తల పగిలి పోయి బ్రెయిన్ బయటకు వచ్చింది. సాయికుమార్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






