ముగిసిన కర్రల సమరం.. 9 మంది పరిస్థితి విషమం

by  |
ముగిసిన కర్రల సమరం.. 9 మంది పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో భాగంగా నిర్వహించే కర్రల సమరం ఈ సారి కూడా ఆగలేదు. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు 97మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆలూరు,ఆదోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ 24గ్రామాల ప్రజలు, భక్తి, విశ్వాసం పేరుతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. దేవరగట్టు కొండపైన మాల మల్లేశ్వర స్వామి వారి విగ్రహాలను తీసుకువెళ్ళే క్రమంలో ఒక వర్గం అడ్డుపడటం, మరో వర్గం రక్షణగా నిలవడంతో ఈ కర్రల సమరం ప్రతి ఏటా సంప్రదాయబద్దంగా వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.

నిన్న రాత్రి 12గంటలకు స్వామి వారి కళ్యాణం జరిపారు.ఉత్సవమూర్తులను మేళతాళాలతో కొండదిగువున సింహసన కట్టవద్దకు చేర్చారు. స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణిఖి,నెరణికి తండా,కొత్తపేటకు చెందిన గ్రామాల భక్తులు ఒకవైపు,అరికెర, అరికెర తండా,సుళువాయి,ఎల్లార్తి,కురుకుంద,బిలేహాల్ విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు మొహరించి కర్రలతో తలపడ్డారు. ఈ సమరం మధ్య విగ్రహాలను తిరిగి కొండ మీదకు చేర్చడంతో ఉత్సవం పూర్తయింది. ఈ ఉత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గతేడాది 48 మందికి గాయాలు కాగా ఈ సారి ఆ సంఖ్య 97కు పెరిగింది.


Next Story

Most Viewed