అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్

by  |

దిశ, వరంగల్: కూరగాయలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్‌తో కలసి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వరంగల్, హన్మకొండ, కాజీపేట్‌‌లోని కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక ప్రతి మార్కెట్‌లోనూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్వారంటైన్ కేంద్రం పరిశీలన
వరంగల్ రూరల్‌లోని వర్దన్నపేట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 35 పడకల క్వారంటైన్ కేంద్రాన్ని కలెక్టర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను, కరోనా వ్యాప్తిని, ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఏర్పాట్లను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags : Stringent measures, high prices, collector, warangal rural



Next Story