- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీపీ ని బలోపేతం చేయండి..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి కార్యకర్త ప్రజలకు వద్దకు వెళ్లి టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి వివరించాలని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపు నిచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో చేవేళ్ల పార్లమెంట్ లోని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్ధాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని సూచించారు. చేవేళ్ల […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి కార్యకర్త ప్రజలకు వద్దకు వెళ్లి టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి వివరించాలని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపు నిచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో చేవేళ్ల పార్లమెంట్ లోని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్ధాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని సూచించారు. చేవేళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు గూడెం సుభాష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చేవేళ్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కృష్ణ స్వామి, ప్రధాన కార్యదర్శి బేతి జగదీష్ రెడ్డి, కుర్రా మహేష్ కుమార్, కోశాధికారి వెలగ రవీ శంకర్, కార్యనిర్వహాక కార్యదర్శులు గుడెపు రాఘవులు, సంధ్యపీగు రాజ శేఖర్, కార్యదర్శి మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






