- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. ఈత కల్లు తాగి వింత ప్రవర్తన.. ఏం జరిగింది..
<p>దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఈత కల్లు దొంగతనం చేస్తున్నారని సదరు యజమాని కల్లులో ఉమ్మెత్త ఆకు కలిపారు. దీంతో కల్లు తాగిన బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సేవలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం వారి […]</p>

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఈత కల్లు దొంగతనం చేస్తున్నారని సదరు యజమాని కల్లులో ఉమ్మెత్త ఆకు కలిపారు. దీంతో కల్లు తాగిన బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సేవలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కార్ఫార్ములా గ్రామంలో ఈత చెట్లకు ఉన్న కళ్ళను నాయినోని పల్లి మైసమ్మ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన సువర్ణ, మల్లేష్, వెంకటమ్మ, బంగారయ్య, బంగారమ్మ, అరవింద్ తాగారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కల్లులో ఏం కలిపారని యజమాని శివ గౌడ్‌ను అడగడంతో ఉమ్మెత్త ఆకు కలిపినట్టు తెలిపారు.






