- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాట్ సర్క్యూట్ తో దుకాణం దగ్ధం.. 50 లక్షల ఆస్తి నష్టం
<p>దిశ, నర్సాపూర్ : హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్(కాసాల) ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఓ హర్డవేర్ దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాట్ సర్కూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి దుకాణం అగ్నికి ఆహుతైంది. దుకాణంలో మంటలు భారీ స్ధాయిలో ఎగిసిపడడంతో వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై […]</p>

X
దిశ, నర్సాపూర్ : హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్(కాసాల) ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఓ హర్డవేర్ దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాట్ సర్కూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి దుకాణం అగ్నికి ఆహుతైంది. దుకాణంలో మంటలు భారీ స్ధాయిలో ఎగిసిపడడంతో వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విషయం తెలుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై స్ధానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు అంటున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని దుకాణం యజమాని కూచి నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






