- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ జెండాలు వాడొద్దు
<p>న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన త్రివర్ణపతకాలను ప్రజలు వాడకుండా చూడాలని రాష్ర్టాలను కేంద్ర హోంశాఖ కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, సంస్థలు పాటించాలని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్ […]</p>

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన త్రివర్ణపతకాలను ప్రజలు వాడకుండా చూడాలని రాష్ర్టాలను కేంద్ర హోంశాఖ కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, సంస్థలు పాటించాలని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్ తో కాకుండా పేపర్ తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైన చర్య కాదని పేర్కొంది. ముఖ్యమైన జాతీయ,సాంస్కృతిక కార్యక్రమాలలో ఫ్లాగ్ కోడ్ ఆప్ ఇండియా-2002 ప్రకారం పేపర్ తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలంది.






