- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వేధింపులు ఆపండి : ఎంపీ రఘురామ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. నవ సూచనలు పేరుతో బుధవారం తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్ 66ఏ ఆ చట్టాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. నవ సూచనలు పేరుతో బుధవారం తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్ 66ఏ ఆ చట్టాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
వాస్తవానికి ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మరోవైపు ఎవరైనా తన ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఆ వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో డిమాండ్ చేశారు.
Next Story






