స్టీఫెన్ హాకింగ్ వెంటిలేటర్ దానం!

by  |
స్టీఫెన్ హాకింగ్ వెంటిలేటర్ దానం!
X

దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఓ వైపు వైద్య సిబ్బంది ముందుండి కరోనా బాధితులను రక్షిస్తున్నారు. మరోవైపు కొంతమంది కరోనా సమయంలో అవసరమైన వైద్య పరికరాలను తయారు చేస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖ‌గోళ శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ వాడిన వెంటిలేట‌ర్‌ను ఆయన కూతురు క్యాంబ్రిడ్జ్ సిటీలో ఉన్న రాయ‌ల్ పాప్‌వ‌ర్త్ హాస్పిట‌ల్‌కు విరాళంగా ఇచ్చింది.

ఖగోళ, భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్ 2018లో మోటార్ న్యూరాన్ (నరాలకు సంబంధించిన వ్యాధి)తో చనిపోయారు. ఆయనకు సంబంధించిన మెడికల్ వస్తువులన్నింటితో పాటు వెంటిలేటర్ డొనేట్ చేశారు. కరోనా క‌ష్ట‌కాల స‌మ‌యంలో ఆ వైద్య ప‌రికాలు ఏమైనా ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్న ఉద్దేశంతో వాటిని నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్‌(ఎన్‌హెచ్ఎస్)‌కు ఇస్తున్న‌ట్లు ఆయన కుమార్తె లూసీ హాకింగ్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బ్రిట‌న్ వ‌ద్ద సుమారు 10 వేల వెంటిలేట‌ర్లు ఉన్నాయి. అయితే మ‌రో 18 వేల వెంటిలేట‌ర్లు అవ‌స‌రం ఉంటుంద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి మాట్ హాన్‌కాక్ తెలిపారు.

Tags: coronavirus, stephen hawking,lucy, ventilator


Next Story

Most Viewed