వరదలో కొట్టుకొచ్చిన విగ్రహం.. ఈశ్వరుడి మహిమ అంటున్న గ్రామస్థులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామం పైడేరు వాగులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో ఓ విగ్రహం కొట్టుకువచ్చింది. అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ గ్రామానికి తరలివచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మొదట గండవరం గ్రామానికి చెందిన [&hellip;]</p>

వరదలో కొట్టుకొచ్చిన విగ్రహం.. ఈశ్వరుడి మహిమ అంటున్న గ్రామస్థులు
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామం పైడేరు వాగులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో ఓ విగ్రహం కొట్టుకువచ్చింది. అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ గ్రామానికి తరలివచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం మొదట గండవరం గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు ఆ విగ్రహాన్ని గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అంతా అక్కడికి క్యూ కట్టారు. వాగు మధ్యలో ప్రతిష్ఠించినట్లుగా ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామంపై కరుణ కటాక్షాలు కురిపించేందుకు ఆ చల్లని తల్లి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రసిద్ధ ఉదయకాలేశ్వర స్వామి ఆలయం ఉండటంతో… ఆ పరమ శివుడిని వెతుక్కుంటూ గంగమ్మ తల్లి గండవరం చేరిందంటున్నారు. వరద ప్రవాహంలోనూ ఆ విగ్రహం ఇంచు కూడా కదలకపోవడం ఆ తల్లి మహిమనేనని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఆ విగ్రహం ఎక్కడ నుంచి వచ్చిందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా వాగులో ఆ దేవత విగ్రహాన్ని చూసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story