డోనకొండ- గజ్జెకొండ మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ ప్రారం

by  |
డోనకొండ- గజ్జెకొండ మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ ప్రారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గుంటూరు- గుంతకల్ డబ్లింగ్,విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా డోనకొండ- గజ్జెకొండ మధ్య 12.4 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణతో పాటు డబుల్ లైన్ పనులు పూర్తవడంతో గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా రైల్వే భద్రతా కమిషనర్ ఆధ్వర్యంలో స్పీడ్ ట్రయల్ తనిఖీ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ రూట్ లో గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైలు రవాణా చేసేందుకు అనుమతించారు.

గుంటూరు- గుంతకల్ మార్గం పూర్తవుతే ఆటంకాలు లేని ప్రయాణానికి, రద్దీ నివాణకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రారంభమైన 12.4 కి.మీ ల మార్గంతో గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ పనుల్లో 81 కి.మీ పొడవునా విద్యుదీకరణతో డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన సెక్షన్లలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రైళ్ల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు డోనకొండ-గజ్జెకొండ స్టేషన్ల వద్ద సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ని ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో భాగస్వామ్యమైన అధికారులు,సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మ్యా అభినందించారు. గుంటూరు- గుంతకల్ మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తవుతే రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించవచ్చన్నారు.


Next Story

Most Viewed