- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌తో కనిపించడంతో అంతా షాక్.. ఇక ఇండస్ట్రీకి దూరం కానుందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘సంఘర్ష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘సంఘర్ష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ఆ తర్వాత ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’(Student of the Year) చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ క్రమంలోనే.. అలియా భట్ తన కో స్టార్ అయిన రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు రెండున్నరేళ్లు. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చినప్పటికీ మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక చివరగా అలియా భట్ గత ఏడాది ‘జిగ్రా’ సినిమాలో నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మెప్పించింది.
ప్రస్తుతం ఆమె ‘అల్ఫా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె అలియా పాల్గొని అందరి దృష్టిని ఆకర్శించింది. ఇక ఈ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ప్రెగ్నెంట్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేన్స్‌లో డిఫరెంట్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన అలియా కడుపు కాస్త ముందుకు వచ్చినట్లు కనిపించడంతో ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఇక ఇండస్ట్రీకి దూరం అయినట్లే అని పలువురు అంటున్నారు. కానీ అభిమానులు మాత్రం వాటిల్లో నిజం లేదని కొట్టి పారేస్తున్నారు. ఇక చివరగా కేన్స్‌లో అలియా ఓ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి నాజుకుగా కనిపించడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






