క్రికెట్‌లో సెక్స్ స్కాండల్స్..‌ లిస్ట్‌‌‌లో స్టార్‌ ప్లేయర్స్

by  |
క్రికెట్‌లో సెక్స్ స్కాండల్స్..‌ లిస్ట్‌‌‌లో స్టార్‌ ప్లేయర్స్
X

దిశ, స్పోర్ట్స్: జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్‌లో చాలా సార్లు వివాదాలు కూడా తలెత్తుతుంటాయి. బాల్ ట్యాంపరింగ్, ఫిక్సింగ్ వంటి వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఆటగాళ్ల దూకుడు ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. మైదానంలో జరిగే వీటన్నింటిపై ఐసీసీ నిబంధనలు ఉన్నాయి. ఏ మాత్రం ఉల్లఘించినా ఐసీసీ కొరడా ఝులిపిస్తుంది.

ముఖ్యంగా మైదానం బయట ఆటగాళ్ల ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారుతున్నది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం.. శృంగారానికి ప్రేరేపించడం.. అభ్యంతరకరమైన మెసేజీలు చేయడం వంటి చర్యలతో కొంత మంది క్రికెటర్లు అభాసుపాలవుతున్నారు. వారి చర్యల వల్ల జట్టుకు, దేశానికి కూడా చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ 2017లో క్రికెట్ టాస్మానియా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా ఆడవారితో లైంగిక సంబంధాల విషయంలో గతంలో వివాదాలు కొని తెచ్చుకున్న కొంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.

నా చివరి మ్యాచ్‌ అప్పుడే.. ఐపీఎల్‌పై ధోని ఫుల్ క్లారిటీ

వారెవరంటే..?

కెవిన్ పీటర్సన్: సౌతాఫ్రికాలో జన్మించిన ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మంచి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అదే సమయంలో సెక్స్ స్కాండల్స్‌లో ఇరుక్కున్నాడు. ప్లేబాయ్ మ్యాగజైన్ మోడల్ వెనీసా నిమ్మోతో చాలా కాలం రొమాన్స్ చేశాడు. ఒకానొక రోజు SMS ద్వారా బ్రేకప్ చెప్పాడు. దీంతో కోపంతో నిమ్మో తన పర్సనల్ విషయలు, ఫొటోలు బయటపెట్టింది. కెవిన్ 24 గంటలు ఒకటే ఆలోచనతో ఉంటాడని.. అతడికి సెక్స్ తప్పా వేరే ఆలోచనలు రావని చెప్పడం వివాదాస్పదంగా మారింది.

షేన్ వార్న్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ క్రికెట్‌లో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో.. మైదానం బయట అంత వివాదాలు కొని తెచ్చుకున్నాడు. ఎన్నోసార్లు సెక్స్ స్కాండల్స్‌లో ఇరుక్కున్నాడు. మెల్‌బోర్న్‌లో ఒకసారి రోడ్ సైడ్ వ్యభిచారిణితో సెక్స్ చేసినట్లు, తన జీవితంలో ఎంతో మంది ఆడవాళ్లు ఉన్నట్లు వార్న్ స్వయంగా తన బయోగ్రఫి ‘నో స్పిన్’లో పేర్కొన్నాడు.

క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్‌కు శృంగార పురుషుడనే పేరున్నది. బీబీఎల్‌లో ఆడే సమయంలో టీవీ యాంకర్ మెల్ మెక్‌లాగ్లిన్‌ను తనతో శృంగారం జరపాలనే రీతిలో మాట్లాడటం అప్పట్లో సంచలనం రేపింది. 2012 టీ20 వరల్డ్ కప్ సమయంలో శ్రీలంకలోని ఒక హోటల్‌లో ఏకంగా ముగ్గురు బ్రిటిష్ మహిళలతో కలిసి ఉండటం కూడా వివాదాస్పదమైంది.

షాహిద్ అఫ్రిది: దూకుడైన బ్యాటింగ్‌కు మారుపేరైన పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది తన సహచర క్రికెటర్లు అయిన హసన్ రాజా, అతిక్ ఉజ్ జమాన్‌లతో కలసి సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్నాడు. 2000లో కరాచీలోని ఒక హోటల్‌లో ముగ్గురు యువతులతో కలిసి ఉండటం పెద్ద వివాదంగా మారింది. అయితే వాళ్లు కేవలం ఆటో గ్రాఫ్‌లు తీసుకోవడానికి వచ్చారని ఆ ముగ్గురు చెప్పుకొచ్చారు. కానీ పీసీబీ వారి మాటలను నమ్మలేదు. ముగ్గురిపై జరిమానా విధించి బ్యాన్ చేసింది.

ఇయాన్ బోథమ్: ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ కూడా తన భార్యను చీట్ చేస్తూ వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన వెయిట్రెస్ కైల్ వెర్రెల్స్‌తో రెండేళ్ల పాటు వివాహేతర సంబంధాన్ని నడిపాడు. ఈ విషయాన్ని కైల్ మాజీ భర్త బయటపెట్టడంతో వివాదంగా మారింది.

ఇమామ్ ఉల్ హక్: పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ ఎంతో మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2019లో ట్విట్టర్‌లో ఒక మహిళ తమ మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టింది. ఇమామ్ పెట్టిన అసభ్యకరమైన మెసేజీలను వెల్లడించడంతో వివాదం తలెత్తింది. అయితే ఆ తర్వాత సదరు మహిళ ఆ మెసేజీలను డిలీట్ చేసింది.



Next Story

Most Viewed