ఆకాశవాణి నుంచి తప్పుకున్న కార్తికేయ

by Shyam |

<p>ఆకాశవాణి .. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ నడిచింది. కారణం ఈ సినిమాకు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం. అయితే అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కార్తికేయ. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. The way forward for the Dream #Aakashavaani &#8230; Thanks to my dear friend @ssk1122 for the support so [&hellip;]</p>

ఆకాశవాణి నుంచి తప్పుకున్న కార్తికేయ
X

ఆకాశవాణి .. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ నడిచింది. కారణం ఈ సినిమాకు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం. అయితే అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కార్తికేయ. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

కొన్ని ప్రయాణాలు అనుకోని ముగింపు కలిగి ఉంటాయి.. అలాంటిదే ఈ జర్నీ కూడా అని తెలిపిన కార్తికేయ.. ఇతర సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యంత రంగా తప్పుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఏయూ అండ్ ఐ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ అశ్విన్ కు తనకు కూడా సృజనాత్మక భేదాలు ఉన్నాయని.. మరొక నిర్మాణ సంస్థ అయితే ఔట్ పుట్ బాగా వస్తుందని నమ్ముతున్నాను అని చెప్పారు. ఆకాశవాణి టీం, డైరెక్టర్ కు విష్ చేసిన కార్తికేయ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా కలిగిన లర్నింగ్ ఎక్స్ పీరియన్స్ మరిచిపోలేని తెలిపారు.

అటు ఆకాశవాణి దర్శకుడు అశ్విన్ గంగరాజు సైతం నోట్ రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ నుంచి స్నేహపూర్వకంగానే తప్పుకున్న కార్తికేయకు అన్ని బెస్ట్ జరగాలని కోరుకున్నారు.

Next Story