శ్రీశైలం ఉద్యోగులపై బదిలీ వేటు

by  |
శ్రీశైలం ఉద్యోగులపై బదిలీ వేటు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలంలో వివాదం నేపథ్యంలో ఈవో కేఎస్ రామారావు చర్యలు చేపట్టారు. ఉద్యోగులపై ఆలయ ఈవో బదిలీ వేటు వేశారు. దేవస్థానం పరిధిలో నిర్వహిస్తున్న 9మంది ఉద్యోగులకు స్థాన చలనం కలిగించారు. గోశాల పర్యవేక్షకురాలిగా విధులు నిర్వహిస్తున్న సాయికుమారిని మరో విభాగానికి బదిలీ చేశారు. అలాగే దేవస్థానం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరి కొంతమంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈవో బదిలీ చేశారు. శ్రీశైలంలో నెలకొన్న అన్యమతస్తుల వివాదం, గోశాలలో గోవులు మృతి చెందుతూ ఉండటంపై ఆరోపణలు, ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్ల నేపథ్యంలో ఈవో చర్యలు చేపట్టారు.

Next Story