పట్టణాల అభివృద్ధికి పెద్దపీట: శ్రీనివాస్ గౌడ్

by Shyam |

<p>మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌజ్ ఫంక్షన్ హాల్‌లో.. పట్టణ ప్రగతిపై ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రభుత్వ ఆశయాల సాధనకు కృషి చేయాలని మంత్రి సూచించారు. పట్టణాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన నిధులు విడుదల చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ [&hellip;]</p>

పట్టణాల అభివృద్ధికి పెద్దపీట: శ్రీనివాస్ గౌడ్
X

మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌజ్ ఫంక్షన్ హాల్‌లో.. పట్టణ ప్రగతిపై ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రభుత్వ ఆశయాల సాధనకు కృషి చేయాలని మంత్రి సూచించారు. పట్టణాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన నిధులు విడుదల చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

Next Story