- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంక పర్యటన మళ్లీ వాయిదా?
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా శ్రీలంక పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది జరగాల్సిన సిరీస్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సిరీస్ జరుగుతుందా?.. లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. గత ఏడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్, ఇతర సిరీస్‌లను నిర్వహించామని, భారత్‌తో జరగాల్సిన సిరీస్‌ను కూడా నిర్వహిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా శ్రీలంక పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది జరగాల్సిన సిరీస్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సిరీస్ జరుగుతుందా?.. లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.
గత ఏడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్, ఇతర సిరీస్‌లను నిర్వహించామని, భారత్‌తో జరగాల్సిన సిరీస్‌ను కూడా నిర్వహిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. విరాట్, రోహిత్‌తో కూడిన సీనియర్ల టీమ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో శిఖర్, భువనేశ్వర్ లాంటి క్రికెటర్లతో కూడిన బీ టీమ్ శ్రీలంక పర్యటనలో పాల్గొననుంది.
Next Story






