‘భాగ్ సాలే’ అంటున్న కీరవాణి పుత్రరత్నాలు

72

దిశ, సినిమా : ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మిస్తున్న చిత్రానికి ప్రణీత్ భ్రమందపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా శ్రీ సింహ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్.. ‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత శ్రీ సింహ హీరోగా వస్తున్న ఈ చిత్ర సక్సెస్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నామని తెలిపారు. క్రైమ్ కామెడీ జోనర్‌లో వస్తున్న చిత్రంలో హీరో క్యారెక్టర్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా కీరవాణి మరో తనయుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుందర్ రామ్ సినిమాటోగ్రాఫర్.

ఈ సందర్భంగా శ్రీ సింహకు ‘తెల్లవారితే గురువారం’ టీమ్ బర్త్‌డే విషెస్ అందించింది. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ సింహ ‘వీరు’ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..