- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటనకు బ్రేక్ చెప్పిన పెళ్లిసందడి ఫేమ్ శ్రీ లీల.. కారణం అదేనా..?
<p>దిశ, వెబ్ డెస్క్: అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన అందాల రాశి శ్రీ లీల. దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలైన పెళ్లి సందడితో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ చేసింది. శ్రీ లీల లుక్స్, పెర్ఫార్మెన్స్ అలాగే డ్యాన్స్ స్కిల్స్‌కి టాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చుకుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించగా, ఈ చిత్రాన్ని కె రాఘవేంద్రరావు నిర్మించారు. ఇదిలా ఉండగా.. నటి శ్రీ లీల అందరినీ […]</p>

దిశ, వెబ్ డెస్క్: అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన అందాల రాశి శ్రీ లీల. దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలైన పెళ్లి సందడితో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ చేసింది. శ్రీ లీల లుక్స్, పెర్ఫార్మెన్స్ అలాగే డ్యాన్స్ స్కిల్స్‌కి టాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చుకుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించగా, ఈ చిత్రాన్ని కె రాఘవేంద్రరావు నిర్మించారు.
ఇదిలా ఉండగా.. నటి శ్రీ లీల అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకు పోతున్నప్పటికీ, శ్రీ లీల నటనకు కొంత బ్రేక్ ఇచ్చి తన MBBS చివరి సంవత్సరం పరీక్షలపై దృష్టి సారించింది. పెళ్లి సందడి విడుదలైన వెంటనే ఆమె సినిమాను ప్రమోట్ చేసి, పరీక్షలు రాయడానికి ముంబైకి వెళ్లింది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ముగించుకుని మళ్లీ తన నటనను ప్రారంభించనుంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం, శ్రీలీల తన తదుపరి చిత్రానికి సత్యదేవ్‌తో ఇప్పటికే సంతకం చేసింది. అలాగే కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు కూడా ఈ యంగ్ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నాయి.






