- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2011 ప్రపంచకప్ ఫైనల్స్‌పై విచారణకు ఆదేశం
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: 2011లో ఇండియాలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని, శ్రీలంక జట్టు టైటిల్‌ను అమ్మేసుకుందని ఆ దేశ మాజీ క్రీడామంత్రి మహిందానంద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శ్రీలంక క్రీడా మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి, రెండు వారాలకు ఒక్కసారి నివేదిక ఇవ్వాలని అధికారులను శ్రీలంక క్రీడా మంత్రి దుల్లాస్ అలహప్పరుమ ఆదేశించారు. మహిందానంద వ్యాఖ్యల ఆధారంగా క్రీడాశాఖ కార్యదర్శి రువాన్ చంద్ర దర్యాప్తు విభాగానికి ఫిర్యాదు […]</p>

X
దిశ, స్పోర్ట్స్: 2011లో ఇండియాలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని, శ్రీలంక జట్టు టైటిల్‌ను అమ్మేసుకుందని ఆ దేశ మాజీ క్రీడామంత్రి మహిందానంద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శ్రీలంక క్రీడా మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి, రెండు వారాలకు ఒక్కసారి నివేదిక ఇవ్వాలని అధికారులను శ్రీలంక క్రీడా మంత్రి దుల్లాస్ అలహప్పరుమ ఆదేశించారు. మహిందానంద వ్యాఖ్యల ఆధారంగా క్రీడాశాఖ కార్యదర్శి రువాన్ చంద్ర దర్యాప్తు విభాగానికి ఫిర్యాదు చేశారు. ఫిక్సింగ్ ఆరోపణలను శ్రీలంక మాజీ క్రికెటర్లు ఖండించారు. తగిన ఆధారాలు చూపాలని జయవర్దనే, సంగక్కర డిమాండ్ చేశారు. మీ ఆధారలన్నింటినీ ఐసీసీకి సమర్పించండి. లేదంటే ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని మహిదానందకు సూచించారు.
Next Story






