- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా దేశానికి రావొద్దు’
by Shamantha N |
<p>కొలంబో : భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో విదేశాలు మనదేశం నుంచి విమానయాన రాకపోకలను నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వంటి దేశాలు భారత్‌పై బ్యాన్ విధించగా.. తాజాగా ఆ జాబితాలో మన పొరుగు దేశం శ్రీలంక చేరింది. ఈ మేరకు శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం ఒక లేఖ విడుదల చేసింది. భారత్- శ్రీలంక మధ్య తిరిగే విమాన ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు […]</p>

X
కొలంబో : భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో విదేశాలు మనదేశం నుంచి విమానయాన రాకపోకలను నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వంటి దేశాలు భారత్‌పై బ్యాన్ విధించగా.. తాజాగా ఆ జాబితాలో మన పొరుగు దేశం శ్రీలంక చేరింది. ఈ మేరకు శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం ఒక లేఖ విడుదల చేసింది. భారత్- శ్రీలంక మధ్య తిరిగే విమాన ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు తెలిపింది. భారత ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story






