- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ కాళహస్తీలో ఆర్జిత సేవలు రద్దు
<p>కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీ ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు దేవాలయ కార్యనిర్వహణాధికారి బుధవారం వెల్లడించారు. కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో రోజువారీగా దేవస్థానం నందు నిర్వహించే ఆర్జిత సేవలైన (రాహుకేతు పూజలు అభిషేకములు, చండీ, రుద్ర హోమములు, కల్యాణోత్సవం, శనీశ్వర స్వామి అభిషేకం)ను మార్చి19 నుంచి ఈనెల31వరకు నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆలయంలో స్వామి, […]</p>

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీ ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు దేవాలయ కార్యనిర్వహణాధికారి బుధవారం వెల్లడించారు. కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో రోజువారీగా దేవస్థానం నందు నిర్వహించే ఆర్జిత సేవలైన (రాహుకేతు పూజలు అభిషేకములు, చండీ, రుద్ర హోమములు, కల్యాణోత్సవం, శనీశ్వర స్వామి అభిషేకం)ను మార్చి19 నుంచి ఈనెల31వరకు నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆలయంలో స్వామి, అమ్మవార్లకు జరుపు అన్ని నిర్ణీత కాల పూజలు, సర్కారీ సేవలు యథావిధిగా, శాస్త్రోక్తముగా ఎట్టి మార్పులు లేకుండా దేవస్థానం వారే నిర్వహిస్తారని కూడా స్పష్టం చేశారు. కావున భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి దేవస్థానం వారికి సహకరించగలరని కోరారు.
tags ; sri kalahasti temple, ap, chittoor, carona virus, close till march 31st






