మెట్రో ట్రైన్‌లో మూవీ ప్రమోషన్స్.. ఆహ్వానపత్రికలు పంచిన హీరో

by  |
SR-Kalyana-Mandapam
X

దిశ, సినిమా : ఎస్‌ఆర్ కళ్యాణమండపం మూవీ యూనిట్ తమ సినిమాను యూనిక్‌గా ప్రమోట్ చేస్తోంది. ఆగస్టు 6న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరుతూ.. హీరో కిరణ్ అబ్బవరం అండ్ ఫ్రెండ్స్ మెట్రో ట్రైన్‌ను ప్రమోషన్‌కు వేదికగా వాడుకున్నారు. అమీర్‌పేట్‌లో మెట్రో ట్రైన్ ఎక్కిన వారు.. ప్రయాణికులకు ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రికలు అందించారు.

కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సినిమాకు ప్రేక్షకుల ప్రేమ, సహకారం ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘మీ సహాయం సుమారు 500 థియేటర్ల యాజమాన్యానికి, సిబ్బందికి సహాయపడుతుంది’ అని మూవీ యూనిట్ తరపున రిక్వెస్ట్ చేశారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శ్రీధర్ గదె దర్శకులు కాగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.

Next Story