జూన్‌లో స్పుత్నిక్-వీ లైట్ వ్యాక్సిన్!

by  |
Russia, Sputnik V
X

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ లైట్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ను జూన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు రెడ్డీస్ ల్యాబ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వంతో, రెగ్యులేటర్లతో చర్చలు జరుప నున్నట్టు రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. ‘ స్పుత్నిక్-వీలైట్‌ను భారత్‌లో జూన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు గాను మా రష్యన్ భాగస్వామి కంపెనీ, గమలేయా ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇది ఒక సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఇప్పటికే రష్యాలో స్పుత్నిక్ వీ లైట్‌కు అనుమతులు లభించాయి.

ఈ వ్యాక్సిన్ 79.4 ఎఫికసీని కలిగి వున్నట్టు ఫలితాలు చెబుతున్నాయి’అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్ సాప్ర తెలిపారు. ‘రష్యాలోని మా భాగస్వామి కంపెనీతో కలిసి మేము పనిచేస్తున్నాం. స్పుత్నిక్ వీ లైట్‌కు సంబంధించిన వ్యాక్సిన్ డాటాను తెప్పించుకుంటున్నాం. ఆ డాటాను అంచనా వేస్తున్నాం. సేఫ్టీ, ఇమ్యూనోజెనిసిటీకి చెందిన 28వ,42వ రోజుల డాటాను పరిశీలిస్తున్నాం. త్వరలోనే స్పుత్నిక్ వీ లైట్ ఇండియన్ రెగ్యులేటర్‌తో మేము చర్చిస్తాం. స్పుత్నిక్ వీ లైట్‌ను భారత్‌కు తీసుకు వస్తామనీ..దానికి భారత్‌లో అనుమతి లభిస్తుందని మేము ఆశిస్తున్నాం’అని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed