Zakary Foulkes: 3 ఓవ‌ర్లు 67 ప‌రుగులు..న్యూజిలాండ్ బౌల‌ర్ చెత్త రికార్డ్

by velandi.Saikiran |

జకారీ ఫౌల్క్స్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ చితక బాదాడు. ఈ నేపథ్యంలోనే 67 పరుగులు సమర్పించుకున్నాడు జకారీ ఫౌల్క్స్.

Zakary Foulkes: 3 ఓవ‌ర్లు 67 ప‌రుగులు..న్యూజిలాండ్ బౌల‌ర్ చెత్త రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ మధ్య రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ జకారీ ఫౌల్క్స్ ( Zakary Foulkes ) చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేవలం 3 ఓవర్లు వేసిన జకారీ ఫౌల్క్స్ ఏకంగా 67 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ తో పాటు 5 వైడ్స్ ఉన్నాయి. 22.30 ఎకనామితో బౌలింగ్ చేశాడు. ఈ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ చితక బాదాడు. ఈ నేపథ్యంలోనే 67 పరుగులు సమర్పించుకున్నాడు జకారీ ఫౌల్క్స్.

వాస్తవంగా అతడు బాగానే బౌలింగ్ చేశాడు, కానీ పొగ మంచు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎంత టెక్నిక్ గా బౌలింగ్ చేసినప్పటికీ బంతి నేరుగా బ్యాట్ పైకి వెళ్లడం గమనించవచ్చు. ఈ తరుణంలోనే 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఇండియా ఛేదించింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 82 పరుగులు సాధించగా ఇశాన్ కిషన్ 76 పరుగులతో రాణించాడు. చివరలో ఆల్రౌండర్ శివమ్‌ దూబే ( Shivam Dube) 36 పరుగులతో జట్టును ఆదుకున్నాడు.

Next Story