భార్యతో విడాకులు?.. ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టిన యుజువేంద్ర చాహల్

by Harish |

భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ జాతీయ జట్టులో చోటు కోల్పోయి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

భార్యతో విడాకులు?.. ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టిన యుజువేంద్ర చాహల్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ జాతీయ జట్టులో చోటు కోల్పోయి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2023లో ఆగస్టులో చివరిసారిగా జాతీయ జట్టుకు ఆడాడు. మరోవైపు, చాహల్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. భార్య ధనశ్రీతో విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ గురువారం ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్టు పెట్టాడు.

కఠిన పరిస్థితుల నుంచి తనను కాపాడినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. ‘దేవుడు నన్ను నేను లెక్కపెట్టలేనన్ని సార్లు కాపాడాడు. నేను రక్షించబడిన సందర్భాలు చాలా వరకు నాకు తెలియదు. కష్టం వచ్చిన ప్రతిసారి అక్కడ ఉన్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు.’అని చాహల్ రాసుకొచ్చాడు. చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఇద్దరు ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీతో ఉన్న ఫొటోలను తొలగించాడు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. ధనశ్రీకు చాహల్ రూ.60 కోట్ల భరణం ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, విడాకుల వార్తలపై చాహల్‌గానీ, ధనశ్రీగానీ స్పందించలేదు.


Next Story