- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. చాహల్ హాట్ కామెంట్స్
కొంత మంది కారణంగా సూసైడ్ చేసుకోవాలని... టీమిండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) సంచలన

దిశ, వెబ్ డెస్క్: కొంత మంది కారణంగా సూసైడ్ చేసుకోవాలని... టీమిండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) సంచలన కామెంట్ చేశారు. ధనశ్రీ తో ( DhanaShree) విడాకుల సమయం లో కొంత మంది తనను చీటర్.. అంటూ ప్రచారం చేశారని ఎమోషనల్ అయ్యాడు చాహల్. అలా చాలామంది చీటర్ అనడంతో తన మెంటల్ హెల్త్ మొత్తం దెబ్బతిందని... వెల్లడించాడు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని... సంచలన వ్యాఖ్యలు చేశాడు చాహల్.
ఓ ప్రముఖ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టాడు చాహల్. అంతేకాదు ధనశ్రీ వర్మ కు ఎందుకు విడాకులు ఇచ్చాను అనే దాని పైన కూడా... క్లారిటీ ఇచ్చాడు చాహల్. ధన శ్రీ అలాగే తాను ఇద్దరం కెరియర్ల పైన దృష్టి పెట్టడంతో.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వెల్లడించాడు. దాంతో ఇద్దరు ఇష్టానుసారంగా విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.
Rj మహ్వాష్ ను ప్రేమించడం లేదని.. ఫోటోలు చూసి చాలా మంది తామిద్దరం ప్రేమలో ఉన్నామని ప్రచారం చేస్తున్నారని వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ సమయంలోనే తన భార్య ధనశ్రీ వర్మ కు చాహల్ విడాకులు ఇచ్చాడు. ఈ మేరకు ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా దాదాపు నాలుగు కోట్లకు పైగా భరణం కూడా ఇచ్చాడు చాహల్.






