- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వాలిఫైయర్ -2 కు ముందు పంజాబ్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా శనివారం రోజున క్వాలిఫైయర్ ( Qualifier 2) రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ రెండవ

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా శనివారం రోజున క్వాలిఫైయర్ ( Qualifier 2) రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ( PBKS) వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో.... పంజాబ్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది.
పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) తిరిగి జట్టులోకి చేరబోతున్నట్లు సమాచారం అందుతుంది. చేతి గాయం కారణంగా... బాధపడుతున్న పంజాబ్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్... ముంబై ఇండియన్స్ తో ఆడబోయే క్వాలిఫైయర్ 2 లో ఆడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు జట్టు నుంచి అధికారిక ప్రకటన వచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ముందుగా చాహల్ ఆడబోడని... సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు.. యుజ్వేంద్ర చాహల్ చాలా ఫిట్ గా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఊపిరి పీల్చుకుంది. చాహల్ వస్తే కచ్చితంగా రెండు వికెట్లు తీయగలడని... అలాంటి ప్లేయర్ జట్టులో ఉండాల్సిందేనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే చాలు కూడా జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నారు.






