IPL 2025: పంజాబ్ టీంలో ఆ ప్లేయర్.. ఓడిపోవడం ఖాయమేనా?

by velandi.Saikiran |   (  Updated:2025-06-03 11:41:36  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) ఫైనల్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్

IPL 2025:  పంజాబ్ టీంలో ఆ ప్లేయర్.. ఓడిపోవడం ఖాయమేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) ఫైనల్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో... ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఉంటుంది. సరిగ్గా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో... మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పంజాబ్ జట్టుకు కొత్త టెన్షన్

రేపు ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో... పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. అది కూడా పంజాబ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) రూపంలో వచ్చి పడింది. చాహల్.. ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్లోకి అడుగుపెట్టాడు. అది కూడా మూడు వేరు వేరు జట్లు కావడం గమనార్హం. మొదట 2016 ఐపీఎల్ ఫైనల్స్ లో బెంగళూరు తరఫున... చాహల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అప్పుడు బెంగళూరు దారుణంగా ఓడిపోయి... ఇంటి దారి పట్టింది.

ఆ తర్వాత 2022 ఐపిఎల్ టోర్నమెంట్ లో... రాజస్థాన్ రాయల్స్ కూడా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు చాహల్. ఇందులో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఓడిపోయింది. ఇక ఈసారి 2025 టోర్నమెంట్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున... ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అంటే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ ఓటమి పాలు అవుతుందని.. దానికి కారణం చాహల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాహల్ ఫైనల్ మ్యాచ్ ఆడితే కచ్చితంగా ఆ జట్టు ఓడిపోతుందని అంటున్నారు. మరి ఈ సెంటిమెంట్ అలాగే కొనసాగితే బెంగుళూరు టైటిల్ గెలవడం ఖాయం.

Next Story