Chahal Dhanashree Divorce: యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకులు ఖరారు? భరణంగా ఎంతంటే?

by Vennela |   (  Updated:2025-02-17 06:58:03  IST  )

Chahal Dhanashree Divorce: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) వ్యక్తిగత జీవితం గురించి చాలా కాలంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Chahal Dhanashree Divorce: యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకులు ఖరారు? భరణంగా ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : Chahal Dhanashree Divorce: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) వ్యక్తిగత జీవితం గురించి చాలా కాలంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. చాహల్ తన భార్యకు విడాకులు(Chahal Dhansree Divorce) ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై వారిద్దరూ స్పందించలేదు..ఖండించలేదు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ఫొటోలు తొలగించడంతో పరోక్ష పోస్టులను షేర్ చేయడంతో ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ వాలంటైన్స్ డే రోజు విడివిడిగా పోస్టులు చేశారు. జిమ్ లో దిగిన ఫొటోలను ధనశ్రీ వర్మ(Dhansree Varma) షేర్ చేశారు. ఈ రోజు కేక్ కట్ చేయాల్సిందే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. చాహల్ కూడా క్రిప్టిక్ పోస్టుతో ఫొటోలను షేర్ చేశాడు. తాజాగా ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ (Chahal Dhanashree Divorce)భారీ మొత్తంలో భరణం చెల్లించేందుకు సిద్ధమైనట్లు ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది.

దాదాపు 60కోట్లు ధనశ్రీ వర్మ(Dhansree Varma)కు భరణంగా చెల్లించేందుకు చాహల్ సిద్ధమైనట్లు సమాచారం. స్టార్ క్రికెటర్ అయిన చాహల్(Yuzvendra Chahal) సంపాదన కోట్లో ఉండటంతో రూ. 60కోట్ల రూపాయలు చెల్లించి వన్ టైమ్ సెటిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు వెబ్ సైట్ పేర్కొంది. అయితే ఈ భరణం వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ధనశ్రీ వర్మపై చాహల్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు దిగుతున్నారు. జిమ్ ఫొటోలను షేర్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 60కోట్ల భరణం ఎందకంటూ ప్రశ్నిస్తున్నారు.

యుజ్వేంద్ర చాహల్(Chahal Dhanashree Divorce) క్రికెటర్. జాతీయ స్థాయి చెస్ ఆటగాడు కూడా. అతను వృత్తిరీత్యా దంతవైద్యుడు, కొరియోగ్రాఫర్. ధనశ్రీ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ధనశ్రీకి సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు ఆమెకు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తన డ్యాన్స్ వీడియోలు, రీల్స్‌ను అభిమానులతో షేర్ చేస్తుంది.

చాహల్ తో దూరంగా ఉంటున్న ధనశ్రీ వర్మ(Dhansree Varma) తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. జిమ్ లో కష్టపడుతూ కొరియోగ్రాఫర్ గా రాణించేందుకు ట్రై చేస్తోంది. ఇక చాహల్ కూడా ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్ధమవుతున్నవారు. ఐపీఎల్(ipl) 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story