- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chahal: ఆగలేకపోతున్నా..నాకు ఓ అమ్మాయి కావాలి!
యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్య కాలంలో

దిశ, వెబ్ డెస్క్: భారత సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్య కాలంలో భారత జట్టుకు దూరమైనప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం తన సత్తా చాటుతున్నాడు. గతంలో RCB జట్టు తరఫున బరిలోకి దిగిన యుజ్వేంద్ర చాహల్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. అయితే అలాంటి ఈ భారత ఆటగాడు యుజ్వేంద్ర చాహల్, సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టాడు. తాను పెళ్లికి రెడీ, అమ్మాయి కావాలి అంటూ పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫోటోలను ఈ సందర్భంగా షేర్ చేశాడు. దీంతో ఈ పోస్టు కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్, పాపం స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కరువులో ఉన్నాడని అంటున్నారు నెటిజెన్స్.
భార్య ధన శ్రీ వర్మకు దూరమై నరకం అనుభవిస్తున్నట్లు ఉన్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే అతనికి అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా, ధన శ్రీ వర్మ, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు గత సంవత్సరం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, రెండు సంవత్సరాలు కాపురం చేసి, విడాకులకు అప్లై చేసుకుంది. 2025 ఐపీఎల్ సమయంలో ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి.
ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా ధనశ్రీ వర్మకు భరణం కూడా ఇచ్చాడు యుజ్వేంద్ర చాహల్. ఇక ఇప్పుడు ధన శ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు కూడా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు RJ మహ్వాష్ అనే అమ్మాయితో యుజ్వేంద్ర చాహల్ డేటింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ ముంబైలో ఫ్లాట్ తీసుకొని, లివింగ్ రిలేషన్షిప్ కూడా ప్రారంభించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఏమైందో తెలియదు కానీ, ఈ జంట మళ్ళీ ఎక్కడా కలిసి కనిపించడం లేదు. అటు ధనశ్రీ వర్మ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.






