ఆ దేశంలో క్రికెట్ లీగ్‌ను ప్రారంభించబోతున్న యువరాజ్ సింగ్.. లీగ్ పేరు ఇదే

by Harish |

భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెనడాలో టీ10 లీగ్ ప్రారంభించనున్నాడు.

ఆ దేశంలో క్రికెట్ లీగ్‌ను ప్రారంభించబోతున్న యువరాజ్ సింగ్.. లీగ్ పేరు ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెనడాలో టీ10 లీగ్ ప్రారంభించనున్నాడు. కెనడా సూపర్ 60 లీగ్ పేరుతో టోర్నీని ఆరంభిస్తున్నట్టు యువరాజ్ శుక్రవారం వెల్లడించాడు. స్టార్ 333 స్పోర్ట్స్ ఇంక్, క్రికెట్ కెనడా సహకారంతో యువీ నేతృత్వంలో ఈ టోర్నీ జరగనుంది. ‘కెనడా సూపర్ 60 లీగ్‌కు నా నాయకత్వాన్ని, విజన్‌ను అందించడం పట్ల సంతోషంగా ఉంది. కెనడాలో క్రికెట్‌ అభివృద్ధికి ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇక్కడి ప్రతిభగల ఆటగాళ్లు, అంతర్జాతీయ ప్లేయర్లు పాల్గొనడం ఈ టోర్నీకి ప్రత్యేకత తీసుకురానుంది. నార్త్ అమెరికాలో క్రికెట్‌పై ఈ టోర్నీ ఏ విధంగా ప్రభావం చూపుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అని యువీ తెలిపాడు. కెనడా సూపర్ 60 లీగ్‌ను పురుషుల, మహిళల విభాగాల్లో 8 జట్లతో టోర్నీని నిర్వహించనున్నారు. జూలైలో ప్రారంభ ఎడిషన్‌ జరగనుంది.


Next Story